యాడికి మండల కేంద్రంతో పాటు మండల వ్యాప్తంగా పలువురు స్కోర్ డీలర్లు రేషన్ కార్డు లబ్ధిదారులకు బియ్యం తక్కువ తూకాలను ఇస్తున్నారని విచారణ చేసి చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ ప్రతాప్ రెడ్డికి సీపీఐ, రైతు సంఘం నాయకులు ఫిర్యాదు చేశారు. సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు మహమ్మద్ రఫీ, వెంకట రాముడు, రైతు సంఘం నియోజకవర్గ అధ్యక్షులు ఓబిరెడ్డి తదితరులు సోమవారం రెవెన్యూ కార్యాలయానికి వెళ్లారు. తహసీల్దార్ కు తక్కువ తూకాలు ఇస్తున్న స్టోర్ డీలర్ల పై ఫిర్యాదు చేశారు. విచారణ చేసి సంబంధిత స్టార్ డీలర్ల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.