Download Now Banner

This browser does not support the video element.

జగిత్యాల: జిల్లా కేంద్రంలోని శ్రీ లోకమాత పోచమ్మ తల్లి దేవాలయ 63వ వార్షికోత్సవంలో ఘనంగా మహిళలు,సుహాసినులుచే సామూహిక కుంకుమార్చన

Jagtial, Jagtial | Aug 22, 2025
అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్టుగా జిల్లా కేంద్రంలోని పురానిపేట శ్రీ లోకమాత పోచమ్మ తల్లి దేవాలయ 63వ వార్షికోత్సవంను ఆలయనిర్వాహకులు ఘనంగా నిర్వహిస్తున్నారు. గత బుధవారం నుండి ఈ నెల 23 వ తేదీ,శనివారము వరకు ఆలయ వార్షికోత్సవ కార్యక్రమములు వైభవంగా జరుగుతున్నాయి.ఈ సందర్భంలో శుక్రవారం ఉదయం 11 గం॥ల ప్రాంతంలో ఆలయం ఆవరణలో అంగడిమఠం భువనేశ్వర్, ఆధ్వర్యములో స్థానిక ఆలయ పూజారి అంగడిమఠం చరణ్ కుమార్ సమన్వయముతో మహిళలు, సుహాసినులుచే "సామూహికకుంకుమార్చన" నిర్వహించారు.  ఈ "సామూహిక కుంకుమార్చన" పూజా కార్యక్రమంలో మహిళలు, సుహాసినులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us