మంథని మండలం మల్లారం గ్రామంలో అన్నారం బ్యారేజ్ బ్యాక్ వాటర్ మంపు బాధిత రైతులను మంథని మండల బీజేపీ అధ్యక్షుడు విరబోయిన రాజేందర్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు కలిసి ముంపు ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత టిఆర్ఎస్ ప్రభుత్వ సమయంలో అన్నారం బ్యాక్ వాటర్ అడ్డుగా అరేంద , మల్లారం గ్రామంలో కరకట్ట నిర్మించడం జరిగింది. ఈ కరకట్ట ద్వారా మల్లారం గ్రామంలో దాదాపు 380 ఎకరాల పంట పొలాలు నీటిలో ముంపుకు గురవడం జరిగింది. గత ప్రభుత్వం నుండి వీరికి క్రాఫ్ హాలిడే ప్రకటించి ఇవ్వడంలో మాత్రం నిర్లక్ష్యం చెయ్యడం జరిగిందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.