సత్తెనపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ మరియు డాక్టర్ లక్ష్మణరావు సీజనల్ వ్యాధులు పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. విష జ్వరాలు వల్ల జ్వరం దగ్గు వంటి లక్షణాలతో రోజుకు 500 కు పైగా కేసులు నమోదవుతున్నాయని సత్తెనపల్లి పట్టణంలో తన కార్యాలయంలో శనివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో పేర్కొన్నారు. చేతులు శుభ్రంగా కడుక్కోవడం విష జ్వరం సోకిన వారికి దూరంగా ఉండటం మాస్కులు ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తెలిపారు. పాము కాటు బాధితులకు యాంటీ డోస్ అందుబాటులో ఉందని తెలిపారు.