గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అన్నా క్యాంటీన్ల పరిసరాల్లో మొక్కలను పెంచాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు అక్షయ పాత్ర సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం నగరంలోని పల్నాడు బస్టాండ్ దగ్గరలోని అన్న క్యాంటీన్ ని కమిషనర్ పరిశీలించి, ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అన్న క్యాంటీన్ల పరిసరాల్లో పచ్చని మొక్కలతో కూడిన ఆహ్లాద కరమైన వాతావరణం కల్పించేందుకు మొక్కలను నాటాలని, అవసరమైన మొక్కలను జిఎంసి అందిస్తుందని అక్షయ పాత్ర సిబ్బందికి తెలిపారు.