కొత్తపేట మండలం ఖండ్రిగ రహదారిపై గురువారం జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్లో క్షతగాత్రుడిని కొత్తపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.