*సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ రేపు జరుగుతున్న విజయోత్సవ సందర్భంగా విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వడాన్నిఅఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుల్లాయి స్వామి ఖండించారు.మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో నగరంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో కుళ్లాయి స్వామి మీడియాతో మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకంలో ఎన్నికల మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన హామీలు తూత్తు మంత్రంగా అమలు చేసి ఏదో రాష్ట్రాన్ని బాగు చేశాం రాష్ట్ర అభివృద్ధి చేశాం బ్రహ్మాండంగా మా పరిపాలన ఉంది అన్నట్టు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి నిర్వహిస్తున్నటువంటి డబ్బులు మొత్తం ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు.