ప్రముఖ సాహిత్య సంస్థ వురిమళ్ల ఫౌండేషన్ 7వ వార్షికోత్సవ మహోత్సవం మంచికంటి మీటింగ్ హాల్‌లో వైభవంగా జరిగింది. నామా పురుషోత్తం అధ్యక్షతన జరిగిన సభలో అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీల్లో బహుమతులకు ఎంపికైన కథల, కవితల పుస్తకాన్ని, బాల కవులు రాసిన కథలు, కవితలతో రూపొందిన సంకలనాన్ని అతిథులు ఆవిష్కరించారు.