శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి చిత్రావతి నది నుంచి ప్రతిరోజు యదేచ్చగా అక్రమ ఇసుక రవాణా నిర్వహిస్తున్నారని ఆదివారం సాయంత్రం స్థానిక బిజెపి నాయకులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పుట్టపర్తి బైపాస్ రోడ్డులో గల దుర్గా ఆలయ సమీపంలో, పట్టణంలోని సాయి నగర్ ఏరియాలో ఇలా అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారని తెలిపారు. సంబంధిత రెవిన్యూ, పోలీస్ అధికారులు అక్రమ ఇసుక రవాణాపై చర్యలు తీసుకోవాలని కోరారు.