శ్రీ సత్య సాయి జిల్లా ఓబులదేవరచెరువు అంబేడ్కర్ సర్కిల్లో బుధవారం మధ్యాహ్నం రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను బీజేపీ నాయకులు దహనం చేశారు. రాజకీయాలకు సంబంధం లేని ప్రధాని మోదీ తల్లిని దూషించడం హేయకరమని మండల బీజేపీ అధ్యక్షుడు వీరాంజనేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉనికి కోసం రాహుల్ ఇలాంటి చర్యలకు పాల్పడడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జిల్లా, మండల బీజేపీ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.