తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రీజినల్ రింగ్ రోడ్డు కు ప్రతిపాదనలు తెచ్చి భూసేకరణ జరుపుతుండగా రైతులు మాత్రం మా భూములు రీజనల్ రింగ్ రోడ్డుకు ఇవ్వమంటూ నిరసన తెలుపుతున్నారు. అందులో భాగంగా ఈరోజు సోమవారం హైదరాబాద్ హెచ్ఎండిఏ కార్యాలయం వద్ద నవాబుపేట మండల రైతులు నిరసన చేపట్టారు. మాకు త్రిబుల్ ఆర్ వద్దు మా భూములు ఇవ్వండి అని డిమాండ్ చేశారు. మండల రైతులు మాట్లాడుతూ త్రిబుల్ ఆర్తో మా భూములు పోతాయని వ్యవసాయ భూములను కోల్పోతున్నామని మాకు తీవ్ర నష్టం వస్తుందని మా జీవనోపాధి కోల్పోయే పరిస్థితి వస్తుందని అన్నారు.