నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం 365 జాతీయ రహదారి మాదారం గ్రామ సమీపంలో ఆగి ఉన్న ఆటోను సోమవారం తెల్లవారుజామున ట్రావెల్ బస్సు ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. మహబూబాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తున్న ట్రావెల్ బస్సు ఆగి ఉన్న ఆటోను ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు మృతి చెందినట్లు తెలిపారు. బస్సులో సుమారు పదిమందికి పైగా ప్రయాణిస్తున్నట్లు పలువురికి గాయాలైనట్లు తెలిపారు.