దోమ లార్వాల నియంత్రణకు చేప పిల్లలు: అధికారులు సీజనల్ వ్యాధుల నియంత్రణలో భాగంగా నగరపాలక అధికారులు గంబూసియా చేప పిల్లలను చెరువులు, నిల్వ నీటి ప్రాంతాల్లో వదిలారు. మంగళవారం గంగినేని చెరువు వద్ద డా.సుధారాణి, కమిషనర్ పి.నరసింహ ప్రసాద్, జిల్లా మలేరియా అధికారి వేణుగోపాల్, ఎంహెచ్వో డా. లోకేశ్ చేప పిల్లలను వదిలారు. లక్షకు పైగా చేప పిల్లలను వదిలినట్లు అధికారులు తెలిపారు.