సీజనల్ వ్యాధుల పై అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ క్రాంతి కుమార్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని చికోడ్ లింగాయిపల్లి ప్రభుత్వ బాలుర వసతి గృహంలో మెడికల్ క్యాంపు, పేరెంట్స్ మీటింగ్ ను హాస్టల్ వార్డెన్ జి శ్రీనివాస్ నిర్వహించారు. ఈ సందర్భంగా పాపన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర డాక్టర్లు విద్యార్థులకు వైద్య పరీక్ష లు నిర్వహించి కావలసిన మందులను అందించారు. నిరంతరంగా కురుస్తున్న వర్షాల వలన వచ్చే వ్యాధుల నుండి రక్షణ ఎలా పొందాలి అని విద్యార్థులకు డాక్టర్లు చిట్కాలు సూచించారు. కార్యక్రమంలోవిద్యార్థులతల్లిదండ్రులు పాల్గొని వారి సందేహాలను కూడా నివృత్తి చేశారు.