ప్రకాశం జిల్లా కొమరోలు మండలం నల్లగుంట్ల గ్రామ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన చోటుచేసుకుంది. గాయపడ్డ వ్యక్తిని 108 అంబులెన్స్ లో గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడు పల్నాడు జిల్లా వినుకొండ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ప్రమాదంపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గాయపడ్డ వ్యక్తి కడప జిల్లా నుంచి వినుకొండకు వెళ్తున్నట్లుగా పోలీసులు తెలిపారు.