జగిత్యాల భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో స్థానిక కార్యాలయంలో శనివారం సాయంత్రం నాలుగు గంటలకు. విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర మంత్రి అమిత్ షాపై మహువా మొయిత్రా చేసిన వ్యాక్యాలు విద్వేషంతో విషం చిమ్మేలా ఉన్నాయి అనిమండిపడ్డారు. ఆమె వ్యాఖ్యలు ఏమాత్రం హుందాగా లేవన్నారు. మమతా బెనర్జీ టీఎంసీ నిర్దేశకత్వంలో ఆమె ఇంత దిగజారుడు వ్యాఖ్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. మహువా మొయిత్రా వ్యాఖ్యలపై పోలీసులు సుమోటగ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ జీవితంలో ఇంతకన్నా దిగజారుడు తనం ఇంకొటి లేదని. మహువ కి ఏ కొంచెం సిగ్గు మిగిలి ఉన్నా క్షమాపణలు చెప్పాలి