ప్రమాదవశత్తు విద్యుత్ షాక్ తో మహిళా మృతి చెందిన ఘటన వికారాబాద్ జిల్లా కుల్కచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటుచేసుకుంది. సోమవారం కుల్కచర్ల ఎస్ఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని చెల్లాపూర్ గ్రామానికి చెందిన లింగంపల్లి విజయలక్ష్మి వయసు 38 సంవత్సరాలు ఇంట్లో విద్యుత్ షాక్ గురై మృతి చెందడం జరిగింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అమ్ములుకున్నాయి. మృతురాలు భర్త చిన్న వెంకటయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.