గ్రామాల్లో సమస్యల పరిష్కారం కోసం వచ్చే వారం నుండి "పల్లెకు పోదాం"వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, గ్రామాలను బాగు చేయాలన్న సత్సంకల్పంతో అధికారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు. బుధవారం ఉదయం 12 కర్నూలు నగరంలోని సునయన ఆడిటోరియంలో పల్లెకు పోదాం కార్యక్రమం నిర్వహణపై 80 మంది పల్లెకు పోదాం స్పెషల్ ఆఫీసర్లు, తహశీల్దార్లతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.