ఆదిలాబాద్ జిల్లా లో బంజారా సమాజ్ వారు నిర్వహించుకుని ఋషి పంచమి వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగానే ఇంద్రవెల్లి మండలంలోని ఆందునాయక్ తండాలో శుక్రవారం ఘనంగా ఋషి పంచమి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఆధ్యాత్మిక గురువు ప్రేమ్ సింగ్ మహారాజ్ ఆశీర్వాదం తీసుకున్నారు. ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక నృత్యాలు ఎంతో ఆకట్టుకున్నాయి. ప్రజలు భారీగా తరలివచ్చి ఉత్సవాలను వీక్షించారు.