శ్రీ సత్యసాయి జిల్లాలో 12 బార్ల ఏర్పాటుకు అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. ధర్మవరం 03, హిందూపూర్ 04, కదిరి 03, పెనుకొండ 01, మడకశిరలో 01 కొత్త బార్ల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ అధికారి గోవింద నాయక్ శుక్రవారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు. అమ్మకాల సమయాన్ని పెంచుతూ నిర్ణయించామన్నారు. ఈనెల 26 వరకు ఆన్లైన్, ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.