Atmakur, Sri Potti Sriramulu Nellore | Aug 26, 2025
నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, అనంతసాగరం మండలం, చిలకలమర్రి జడ్పీ హైస్కూల్లో మంగళవారం తెలుగు ఉపాధ్యాయులు శివ శంకరయ్య, గణిత ఉపాధ్యాయులు చల్లా చంద్రశేఖర్ రెడ్డి విద్యార్థులకు వినాయక చవితి ప్రాశస్త్యం గురించి వివరించారు. పండుగను భాద్రపద మాసం శుక్లపక్ష చవితి నాడు జరుపుకుంటామని తెలియజేశారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను నదులలో, కాలువలలో నిమజ్జనం చేయడం ద్వారా జలాచరాలకు ముప్పు వాటిల్లుతుందన్నారు. మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని వారు కోరారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు వినాయకుడి బొమ్మలను తలలకు పెట్టుకొని అలరించారు.