సెప్టెంబర్ 1న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద పిఆర్టియు రాష్ట్ర శాఖ పిలుపుమేరకు సిపిఎస్ రద్దుకై తలపెట్టిన మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పి ఆర్ టి యు వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు కడియాల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తా నుండి అలంపరి వరకు ఆదివారం బైకు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు వికారాబాద్ మండల అధ్యక్షులు కేతన్న ప్రధాన కార్యదర్శి పట్నం రాఘవేందర్ తదితరులు ఉన్నారు