Parvathipuram, Parvathipuram Manyam | Aug 26, 2025
తమకు సకాలంలో జీతాలు చెల్లించాలని కోరుతూ బలిజిపేట ఎంపీడీవో కార్యాలయం వద్ద మంగళవారం గ్రీన్ అంబాసిడర్లు, గ్రీన్ గార్డులు సిఐటియు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.మన్మధరావు మాట్లాడుతూ తెల్లారి నిద్రలేచిన నుండి ఊరు చెత్తనంతటిని శుభ్రపరచి గ్రామాన్ని శుభ్రంగా ఉంచే తమకు ఇచ్చే 6000 రూపాయలు జీతం కూడా నెల నెల సకాలంలో ఇవ్వటం లేదన్నారు. తక్షణమే తమకు జీతాలు సకాలంలో చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో, డిప్యూటీ ఎంపీడీవోకు వినతిపత్రాన్ని అందజేశారు.