విద్యార్థులు చదువుతూ పాట పలు క్రీడల్లోనూ రాణించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. శుక్రవారం సాయంత్రం 5గంటలకు జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు కరీంనగర్ ప్రాంతీయ క్రీడా పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్ సింగ్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ విద్య ఎంత అవసరమో క్రీడలు అంతే ఉపయోగమని అన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, ఆరోగ్యాన్ని కలుగజేస్తాయని తెలిపారు. క్రీడా పాఠశాలలో ప్రభుత్వం కల్పించిన సదుపాయాలను సద్వినియోగం చేసుకొని జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో రాణించాలన్నారు.