కుందుర్పి మండల కేంద్రంలోని పలు కాలనీలో విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా మారాయి. కొన్ని విద్యుత్ స్తంభాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. మరికొన్ని వంగిపోయాయి. విద్యుత్ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. విద్యుత్ స్తంభాలు కూలిపోతాయేమోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. విద్యుత్ శాఖ అధికారులు స్పందించి కొత్త విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయాలని మంగళవారం పలువురు ప్రజలు కోరారు.