వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాష్ట్రంలో ప్రతి అంశాన్ని దుష్ప్రచారం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఎమ్మెల్సీ బీద రవిచంద్ర తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గురువారం నగరంలోని ముఖ్యమంత్రి సభా ప్రాంగణ పనుల పరిశీలన కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షుడు ఇతర ఎమ్మెల్యేలతో కలిసి సభా ప్రాంగణాన్ని పరిశీలించారు.