నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం జలదుర్గంలో కృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణునికి గురువారం గ్రామోత్సవ నిర్వహించారు. త్రైత సిద్ధాంతం ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శ్రీకృష్ణుని ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో కొలువుంచి గ్రామ పురవీధుల గుండా ఊరేగింపు చేశారు. ఈ ఊరేగింపులో మండల కో ఆప్షన్ మెంబర్ రసూల్, భక్తులు పాల్గొన్నారు.