నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంజులాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం నో బ్యాగ్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు సిద్ధ పద్మ మాట్లాడుతూ విద్యార్థులకు కొత్తదనం ఉండేలా ప్రతి నెల నాలుగవ శనివారం రోజున క్విజ్ పోటీలు, సమకాలీన అంశాలపై డిబేట్లు, సదస్సులు, వృత్తి విద్య అంశాలపై అవగాహన, క్రీడలు, రాజ్యాంగంపై మౌఖిక ప్రశ్నల పోటీలు లాంటివి నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు హేమలత, సంతోష్, రాజేందర్, శ్రీనివాస్, సురేందర్, మసియుద్దిన్, సత్తయ్య, ఆశాకిరణ్, విద్యా రాణి, సునీత, ముత్తన్న తదితరులు పాల్గొన్నారు.