మధ్యతరగతి కుటుంబాలకు రైతందానికి చిరు వ్యాపారులకు పేద ప్రజలకు దీపావళి వెలుగులు నింపాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ స్లాబ్ లో పెద్ద మొత్తంలో తగ్గించిన సందర్బంగా మార్పల్లి బీజేపీ అధ్యక్షులు రామేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం జీఎస్టీ ని సులభతరం చేస్తూ పేద రైతు మద్ద తరగతి ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుందని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎల్లప్పుడు పేదల ప్రభుత్వమేనని అన్నారు.