వేసవి కాలంలో ఉపాధి హామీ కూలీలు పనులు చేసే ప్రదేశాలలో జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీఓ శ్రీరామ్ అన్నారు. బుధవారం పెద్దమందడి మండల పరిధిలోని బలిజపల్లి గ్రామంలో ఉపాధి హామీ ఫీడర్ ఛానల్ పనులను మధ్యాహ్నం ఒంటి గంటకు పరిశీలించారు.ఈ సందర్బంగా తెలంగాణ సాంస్కృతిక సారధి వనపర్తి కళాజాత బృందం కలిసి వేసకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. అలాగే ఉపాధి హామీ కూలీలు ఎండాకాలం 7:00 నుండి 12 గంటలలోపు పనిచేయాలని పనిచేసే చోట మంచినీటి సౌకర్యం ఉండాలని, అదేవిధంగా ఎండను తట్టుకొనుటకు తెల్లటి దుస్తులను వాడాలని తలపై టోపీ గాని తలపాగా ధరించి వడదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.