ఐరాల మండలంలోని స్థానిక ఆలయంలోని పాలేటమ్మ విగ్రహాన్ని దొంగలు అపహరించారు. నలుగురు వ్యక్తులు కలిసి ఈ చోరీకి పాల్పడగా, వారిలో ఒక మహిళ కూడా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అప్రమత్తమై దర్యాప్తు ప్రారంభించారు. స్పందించిన పోలీసులు, ఆ నలుగురినీ తవణంపల్లి మండల పరిధిలో పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్నారు