విశాఖపట్నంలో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో, ముఖ్యంగా విశాఖ ఉత్తర నియోజకవర్గం లోని మురళి నగర్ లో వేడుకలు ఘనంగా నిర్వహించారు.మాధవ దారిలోని ప్రింట్స్ యూత్ కమిటీ వారు దాదాపు 20 అడుగుల ఎత్తైన మట్టి వినాయకుని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేశారు. వివిధ ప్రాంతాల్లో భారీ వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి భక్తులు పూజలు నిర్వహించారు. వందలాది మంది భక్తులు వినాయకుని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ వేడుకల్లో యువత ఉత్సాహంగా పాల్గొంంది. బీచ్ రోడ్డులో వరుసుగా ఏర్పటు చేసిన వినాయక మండపాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి.