నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలంలోని తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో వెలిసిన గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీశ్రీశ్రీ గురు లోకమసంద్ భావోజి జాతర మహోత్సవాల్లో భాగంగా మంగళవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి హాజరై దర్శించుకున్నారు. దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించితీర్థప్రసాదాలను స్వీకరించారు. జాతర మహోత్సవాలు దర్శనార్థం విచ్చేసిన ముఖ్యమంత్రి కి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతించి కృతజ్ఞతలు తెలియజేశారు.