బడంగ్ పేటలో లండన్ లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చైతన్య కుటుంబ సభ్యులను ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం పరామర్శించి ధైర్యం చెప్పారు. బిజెపి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. చైతన్య మృతదేహాన్ని త్వరగా స్వగ్రామానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. లండన్ లో రాయబార కార్యాలయం అధికారులతో మాట్లాడుతుందని త్వరలో చైతన్య మృతదేహం ఇక్కడికి వస్తుందని తెలిపారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.