సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా భారీగా వర్షపాతం నమోదయింది. మంగళవారం సాయంత్రం నుండి ఏకధాటిగాకు వర్షం కురువగా బుధవారం ఉదయం వరకు జహీరాబాద్ నియోజకవర్గంలో నమోదైన వర్షపాతం ఇలా ఉంది. జహీరాబాద్ మండలంలో 5..80, మొగుడంపల్లి మండలంలో 5.68, కోహిర్ మండలంలో 5.45, ఝరాసంగం మండలంలో 5.43, న్యాల్కల్ మండలంలో 4.70 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.