తిరుపతి పవిత్రతను తానే కాపాడుతున్నట్టు నీతులు చెప్పే తెలుగుదేశం మంత్రి, తిరుపతిలో ఆయన చేస్తున్న రాసలీలలను గురించి స్వయాన ఆ పార్టీ అధికార ప్రతినిధి సుధాకర్ రెడ్డి పత్రికా ముఖంగా చెప్పారు అన్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి.అలాంటి మంత్రిని చూసి ఆ పార్టీ నాయకులు, ప్రజలు ఛీ కొడుతున్నారు, ఉమ్మేస్తున్నారు అని చెప్పారు. ఇటువంటి వ్యక్తిపై చంద్రబాబు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు.