ములుగు జిల్లా కేంద్రంలో విద్యా శాఖా అధికారి సిద్ధార్థ రెడ్డిని కలిసి ఆదివాసీ నిర్మాణ సేన (ఏఎన్ఎస్) రాష్ట్ర అధ్యక్షుడు కొర్స నర్సింహా మూర్తి ఆధ్వర్యంలో నేడు గురువారం రోజున ఉదయం 11 గంటలకు వినతిపత్రం అందజేశారు. వాజేడు, వెంకటాపురం ఏజెన్సీ మండలాల్లో విద్యా వ్యవస్థ నిర్వీర్యం అవు తోందని, పాఠశాలల్లో విద్యార్థులు పదుల సంఖ్యలో ఉన్నప్పటికీ ఉపాధ్యాయులు మాత్రం ఒక్కొక్కరే ఉన్నారని, దీనివల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ప్రతి 11మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలన్న విద్యా హక్కు చట్టా న్ని పాటించడం లేదని అన్నారు. ఉపాధ్యాయులు స్థానికంగా ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకో