మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మచ్చలేని నాయకుడని వైసీపీ జీడీనెల్లూరు నాయకులు తెలిపారు. ఆయనపై ఎమ్మెల్యే డాక్టర్ థామస్ చేసిన ఆరోపణలను ఖండించారు. 30 ఏళ్లుగా ప్రజాసేవకు అంకితమై అవినీతికి దూరంగా ఉన్న నారాయణస్వామిపై ఆరోపణలు తగదన్నారు. మరోసారి ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. వెంకటరెడ్డి, కోదండన్, హరిబాబు పాల్గొన్నారు.