కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని ఇందిర నగర్ కాలనీలో వినాయక విగ్రహాన్ని ట్రాక్టర్ పై ఉంచుతుండగా క్రేన్ తాడు తెగిపోయింది. దీంతో వినాయకుడు కింద పడ్డాడు. వినాయక విగ్రహం కూలిపోవడంతో అధికారులు అక్కడనుండి విగ్రహాన్ని తొలగించారు. క్రేన్ తాడు తెగిపోవడంతోనే ఈ అపశృతి జరిగినట్లు స్థానికులు తెలిపారు. క్రేన్ డ్రైవర్ అజాగ్రత్త వల్లే ఈ సంఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు.