గిరిజన ఆశ్రమ పాఠశాల హాస్టల్ లో పనిచేస్తున్న డైలీవేజ్ కాంటినింజెంట్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని నేటి నుండి నిరవధిక సమ్మెను ప్రారంభించారు ఈమేరకు మరిపెడ గిరిజన ఆశ్రమ పాఠశాల ముందు చేపట్టిన సమ్మెకు ఎల్ హెచ్ పి ఎస్ ఆధ్వర్యంలో పూర్తిస్థాయిలో మద్దతు ప్రకటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డైలీ వేజ్ కార్మికుల ఉద్యోగాలు పర్మినెంట్ చేయాలని టైం స్కేల్ చేయాలని అప్పటివరకు జిల్లా కలెక్టర్ గెజిట్ ప్రకారం జీతాలు చెల్లించాలని మరణించిన వారి స్థానంలో కుటుంబ సభ్యులకు పని కల్పించాలని పూర్తి కాలం పని చేసిన వారందరికీ పూర్తి వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.