ఈ నెల 10వ తేదీన నిర్వహించిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి చట్టబద్ధత ఉందని కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ ఛైర్ పర్సన్ బీమున పల్లి లక్ష్మీదేవి స్పష్టం చేశారు. మున్సిపల్ చైర్మన్ శనివారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్, మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ ఆదేశాలతో మున్సిపల్ కమిషనర్ బుధవారం సమావేశాన్ని నిర్వహించారని తెలిపారు. ఈ సమావేశానికి చట్టబద్ధత లేదని స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ప్రకటించడం తప్పు అన్నారు.