శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలోని అరబిక్ రెస్టారెంట్ ను మున్సిపల్ కమిషనర్ సిస్ చేశారు. ఆ రెస్టారెంట్ పై ఫిర్యాదులు అందడంతో కమిషనర్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో కస్టమర్లు తిని వదిలేసిన ఆహారాన్ని మరల ఇతర కస్టమర్లకు అందిస్తున్నారని, కుళ్ళిన చికెన్ ను స్టోర్ చేసి ఉంచారని, అపరిశుభ్రత నెలకొని ఉందని గుర్తించారు. దీంతో దీనిని సీజ్ చేసినట్టు తెలియజేశారు.