వాంకిడి మండలం నార్లపూర్ గ్రామానికి చెందిన జనాబాయి సోమవారం తన భర్తతో కలసి వ్యవసాయ పొలంలో గడ్డి కోస్తుండగా పాము కాటుకు గురైంది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వాంకిడి ఎస్ఐ మహేందర్ తెలిపారు. మృతురాలి భర్త శంకర్ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేందర్ తెలిపారు.