మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులు నేడు శుక్రవారం ఉదయం నుండి కానుకుర్తి గ్రామంలో రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. రాస్తారోకో చేస్తున్న సమయంలో మహిళా రైతు సొమ్మసిల్లి పడిపోవడంతో 8 గంటల సమయంలో జిల్లా ఆస్పత్రికి తరలించారు.