ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సిపి మైనార్టీ విభాగమా ఆధ్వర్యంలో సోమవారం గ్రీవెన్స్ లో జిల్లా కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా మైనారిటీలకు మసీదులో పనిచేస్తున్న ఇమాములకు నెలకు పదివేల రూపాయలు సహాయకులకు 5000 రూపాయలు వంతున ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈద్గాలకు, ఖభరిస్తాన్ లకు స్థలాలను కేటాయించాలని కోరారు అదేవిధంగా పేద ముస్లింలకు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా దుల్హన్ పథకం కింద నగదును కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ జిల్లా నేతలతో పాటుగా వైసీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి చుండూరు రవి పాల్గొన్నారు