కళ్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామ సమీపంలో మారెమ్మ దేవాలయం వద్ద గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొలెరో వాహనం- ఆటో ఢీకొన్నాయి. ప్రమాదంలో రాయదుర్గం మండలం మల్లాపురం గ్రామానికి చెందిన వన్నూరు స్వామి (39) అనే వ్యక్తి మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.