ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పట్టణంలోని టిడిపి కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన సొసైటీ చైర్మన్లతో సమావేశమయ్యారు. సొసైటీల్లో అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, కార్యచరణపై ఆయన సూచనలు చేశారు. సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. అనంతరం చైర్మన్లు ఎమ్మెల్యేను సన్మానించారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని సొసైటీ సమస్యలను ముమ్మరంగా చర్చించారు.