వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే రామ్ మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ముదిరాజ్ కులస్తులకు పరిగి మండలంలో ముదిరాజ్ భవనం నిర్మాణానికి స్థలం కేటాయిస్తానని హామీ ఇవ్వటం జరిగింది. పరిగి మండల పరిధిలోని రంగాపూర్ సమీపంలో ముదిరాజ్ భవన నిర్మాణానికి మూడు ఎకరాల స్థలానికి సంబంధించిన ప్రోసిడింగ్ ముదిరాజ్ సంఘ సభ్యులకు ఇవ్వడంతో నేడు శనివారం పరిగి నియోజకవర్గ ముదిరాజ్ సంఘం సభ్యులుఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి నీ శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన మాట ప్రకారం ముదిరాజ్ సంఘానికి భూమి కేటాయించడం జరిగిందన్నారు. ఆ స్థలంలో ఎమ్మెల్యే తన నిధుల నుండి ముదిరాజ్ సంఘం భవన నిర్