మహాత్మా గాంధీ మా మోర ఆలకించండి... అంటూ జిందాల్ భూ నిర్వాసితులు దేశ రాజధాని ఢిల్లీలో గాంధీ సమాధికి వినతిపత్రం సమర్పించారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఇప్పటికే విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గానికి చెందిన జిందాల్ భూ నిర్వాసితులు ధర్నా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా జగన్ ఆధ్వర్యంలో గురువారం గాంధీజీ సమాధి వద్దకు చేరుకొని తమకు న్యాయం చేకూర్చేందుకు జిందాల్ యాజమాన్యానికి మంచి బుద్ధి ప్రసాదించాలని వినతి పత్రం సమర్పించారు.