కళ్యాణదుర్గం పట్టణంలో నకిలీ రూ. 200 కరెన్సీ నోట్ల కలకలం రేగుతున్నది. గత మూడు రోజులుగా పట్టణంలోని వ్యాపారులకు 200 రూపాయల దొంగ నోట్లు వస్తున్నాయి. అచ్చం ఒరిజినల్ నోట్ల మాదిరే ఉండడంతో ఏది నకిలీ నోటో ,ఏది ఒరిజినల్ నోటో అర్థం కావడం లేదు. గత రెండు రోజుల క్రితం ఓ వ్యక్తి షాప్ లోకి వెళ్లి నకిలీ రూ.200 నోటు ఇచ్చాడు. అతడు వెళ్లిపోయాక టీ స్టాల్ నిర్వాహకుడు అది నకిలీ నోటని గుర్తించాడు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. రోజూ నకిలీ నోట్లు పట్టణంలోని ఏదో ఒక ప్రాంతంలో చలామణి అవుతున్నాయి. పోలీసులు నిఘా పెంచి నకిలీ నోట్లను చలామణి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.